ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ భూముల కౌలు వేలం

ABN, First Publish Date - 2022-05-25T05:44:14+05:30

ఆలయ భూముల కౌలు వేలం

సమావేశంలో మాట్లాడుతున్న ఈవో శ్రీనివా్‌స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, మే 24: చేవెళ్ల పరిధిలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములను రైతులకు వేలం ద్వారా కౌలుకు ఇచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివా్‌సలు తెలిపారు. మంగళవారం వేలం నిర్వహించి 109ఎకరాల 33గుంటల సాగు భూములు కౌలుకు(లీజు)ఇచ్చారు. ఇందులో చేవెళ్ల మండలంలోని జాలగూడ, కేసారం, ముడిమ్యాల్‌, మల్కాపూర్‌, షాబాద్‌ మండలంలోని బొబ్బిలిగామ, మల్లారెడ్డిగూడ, తాళ్లపల్లి, చందనవెళ్లి, దోస్వడ, సోలిపేట, శంకర్‌పల్లి మండలంలోని దోభిపేట్‌, పూడర్‌ మండలంలోని ఉమ్మెతల్‌, చనుగోముల్‌, శంషాబాద్‌ మండలంలోని మల్కారం, రామానుజపూర్‌, పాల్మకుల, మొయినాబాద్‌ మండలంలోని పెద్ద మంగళారం, శ్రీరామ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్‌ మండలంలోని నిజాంపూర్‌, పెద్దాపూర్‌, కొండాపూర్‌, మారేపల్లి, సంగారెడ్డి, రుద్రారం, ఇస్నాపూర్‌, ఫరూక్‌నగర్‌ మండంలంలోని ఫారుక్‌నగర్‌, నర్సప్పగూడ, చేగుర్‌, దూసకల్‌ తదితర గ్రామాల్లో ఉన్న చేవెళ్ల శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి భూములను కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు. లీజుకు ఇవ్వడం ద్వారా రూ.3లక్షలా 65వేల 850 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల పాటు భూములను ఆయాగ్రామాల రైతులు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు డి.ప్రవీణ్‌కుమార్‌, చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి, దేవాలయం అర్చకులు దేవుని వామనాచార్యులు, వాసుదేవాచార్యులు, శ్రీపాదు, శ్రీకాంతచారి, ఉన్నారు. 

Updated Date - 2022-05-25T05:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising