ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ ప్రకటనతో నాయకుల సంబరాలు

ABN, First Publish Date - 2022-10-07T05:51:11+05:30

బీఆర్‌ఎస్‌ ప్రకటనతో నాయకుల సంబరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌/తాండూరు/మేడ్చల్‌ అక్టోబర్‌ 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనపై మేడ్చల్‌లో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బుధవారం సంబరాలు నిర్వహించారు. పటాకాలు కాల్చి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు శేఖర్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, భాస్కర్‌యాదవ్‌, సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, రామస్వామి, సాటే న రేందర్‌, నాగరాజు, మహేష్‌ , నవీన్‌కుమార్‌రెడ్డి, ఏఎస్సార్‌, రమేష్‌, నర్సింహ్మస్వామియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్థాయిలో బీఆర్‌ఎ్‌సగా ఆవిర్భవించిన సందర్భంగా బుధవారం ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ను ప్రకటించగానే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్డపైకి వచ్చి బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం సంబరాలను ఘట్‌కేసర్‌లో పార్టీ శ్రేణులు రెండు గ్రూపులుగా ఏర్పడి నిర్వహించారు. మొదట బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో  చైర్‌ పర్సన్‌ ముల్లి పావని యాదవ్‌ పాల్గొన్నారు. గతంలో ఏ కార్యక్రమం నిర్వహించిన ఉమ్మడిగా నిర్వహించేవారు. ఉన్నట్టుండి పార్టీ ఆవిర్భావం రోజునే రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమాలలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అదేవిధంగా తాండూరు పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీని సీఎం కేసీఆర్‌  బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించడంతో బుధవారం ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నయీం(అప్ఫు) ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతో దేశ వ్యాప్తంగా మార్పు సాధించడం ఖాయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పీఎం అవుతారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రాఘవేందర్‌, ముక్తార్‌, పట్టణ కార్యదర్శి సంతో్‌షగౌడ్‌, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసాచారి, భద్రేశ్వరాలయం చైర్మన్‌సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T05:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising