ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వకర్మలకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలి

ABN, First Publish Date - 2022-07-03T05:52:48+05:30

విశ్వకర్మలకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలి

ఆమనగల్లు: మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విశ్వకర్మ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ విశ్వకర్మ సంఘాల ఆందోళనలు 
  • మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం 


ఆమనగల్లు/చేవెళ్ల/మొయినాబాద్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 2: బీజేపీ జాతీయనేత తల్లోజు ఆచారిని ఉద్దేశించి విశ్వకర్మలను అవమానపరిచేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ విశ్వకర్మలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు తల్లోజు విజయ్‌కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేసి టీఆర్‌ఎస్‌, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన శ్రీకాంత్‌ చారి, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలను మంత్రి కేటీఆర్‌ మరచిపోయి ఆసామాజిక వర్గానికి చెందిన విశ్వకర్మలను అవమాన పరచడం ఆయన ఆహంకార ధోరణికి నిదర్శనమన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పేవరకూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు విజయ్‌కృష్ణ, తల్లోజు వెంకటయ్య విష్ణుచారి, రాజు, అశోక్‌, యాదగిరి, శివకుమార్‌, మల్లేశ్‌, రామాంజనేయులు, శ్రీనివాస్‌, భాస్కర్‌, శ్రీహరి, నయనాచారి, రవికుమార్‌, జంగాచారి, అశోక్‌, కిరణ్‌, పుల్లయ్య, చంద్రం, భాను, ముత్యాలు, నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండల కేంద్రంలో విశ్వకర్మలు రాలీ తీసి అంబేడ్కర్‌, పూలే విగ్రహలకు నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే మొయినాబాద్‌ కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు శ్రీనివాసచారి, జిల్లా నాయకులు వడ్ల లింగచారి, శంభులింగం, మొయినాబాద్‌ మండలాద్యక్షుడు సంతోషచారి, వడ్ల నర్సింహాచారి, రాజగోపాల్‌చారి ఉన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ చౌరస్తాలో విశ్వకర్మల ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో విశ్వకర్మ సంఘాల నాయకులు భూపాలాచారి, శ్రీనివాసచారి, వంశీ, అరవింద్‌, ప్రభాకర్‌, మాధవ్‌, చిదంబర్‌, వీరేష్‌, యాదగిరి, లక్ష్మణ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising