ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ABN, First Publish Date - 2022-09-21T05:30:00+05:30

తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జడ్పీ సీఈవో, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, సెప్టెంబరు 21 : తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని వికారాబాద్‌ జడ్పీ అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం జడ్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న ఆయన నిజాంకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం మినహా మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారని తెలిపారు. బడుగు వర్గాల గళంగా పేరొందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. నేటితరం కొండా లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, పీఆర్‌ఎంఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్‌, సూపరింటెండెంట్‌ ఉష, రమేష్‌కుమార్‌, రాంరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising