ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ ఫాంహౌస్‌ కుట్రలు చేస్తుండు

ABN, First Publish Date - 2022-10-28T00:05:54+05:30

సీఎం కేసీఆర్‌ మునుగోడు ఉప ఎన్నిక కోసం ఫాంహౌస్‌ కుట్రలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, అక్టోబరు 27 : సీఎం కేసీఆర్‌ మునుగోడు ఉప ఎన్నిక కోసం ఫాంహౌస్‌ కుట్రలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులతో కలసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లిన నాయకులు బీజేపీకి అవసరం లేదని, మరోసారి పోటీ చేసేందుకు కూడా పనికిరాని ఆ నాయకులు వారి నియోజకవర్గాల్లో చెల్లనివారేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ పోలీసుల సాయంతో కుట్రలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, కౌన్సిలర్‌ శ్రీదేవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీవి దిగజారుడు రాజకీయాలు

తాండూరు : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే్‌షకుమార్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం రమే్‌షకుమార్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తన ఫాంహౌ్‌సలో కేసీఆర్‌ మెప్పుకోసం ఉండి, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీకి సంబంఽధం లేని వారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రోహిత్‌రెడ్డికి నీచ రాజకీయాలు చేయడం అలవాటేనని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన రోహిత్‌రెడ్డి డబ్బులు తీసుకునే టీఆర్‌ఎ్‌సకు అమ్ముడుపోయాడని తాండూరు ప్రజలకు తెలుసునని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. కార్యక్రమంలో తాండూరు పట్టణాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, వికారాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు హన్మంతు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, కౌన్సిలర్లు లలిత, బాలప్ప, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో కులకచర్ల చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇదంతా సీఎం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామా అని అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్‌, ప్రధాన కార్యదర్శి హన్మంతు, కులకచర్ల మాజీ సర్పంచ్‌ జానక్‌రాం, సాల్వీడ్‌ మహిపాల్‌, ఆంజనేయులు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T00:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising