ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల అభ్యున్నతికి కేసీఆర్‌ కృషి

ABN, First Publish Date - 2022-01-28T05:07:44+05:30

దళితుల అభ్యున్నతికి కేసీఆర్‌ కృషి

వెంకటాపూర్‌ దళితవాడలో పర్యటిస్తూ దళితబంధు పథకం గురించి వివరిస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • వెంకటాపూర్‌లో దళితబంధు లబ్ధిదారుల సర్వే

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 27: దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషిచేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. వెంకటాపూర్‌లో గురువారం నిర్వహించిన దళితబంధు సర్వేలో ఆయన పాల్గొని దళితవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు ద్వారా వచ్చే రూ.10లక్షలతో 30రకాల వ్యాపారులు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రమంతటా దళితబంధు అమలుచేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో మొదట వెంకటాపూర్‌లో దళితబంధు లబ్ధిదారులను ఎంపికచేస్తామన్నారు. దళితబంధు దేశానికే ఆదర్శమన్నారు. మేడ్చల్‌ జిల్లా ఐదు నియోజకవర్గాల్లో ఫిబ్రవరి ఐదు వరకు 500మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి మార్చి మొదటి వారంలో నిధులు విడుదల చేస్తామన్నారు. అంతకుముందు తాళ్లకుంట చెరువు మరమ్మతులను పరిశీలించారు. దాతలసాయంతో బాలాజీ వేంకటేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ గీతశ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ సత్యనారాయణగౌడ్‌, ఎంపీడీవో అరుణారెడ్డి, ఎంపీటీసీ రామారావు, కార్యదర్శి లింగారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, వేణుగోపాల్‌, మహంకాళి, వెంకటేష్‌, రవీందర్‌, హరీష్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising