ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ జిల్లా కార్యదర్శిగా జంగయ్య

ABN, First Publish Date - 2022-08-04T05:45:47+05:30

సీపీఐ జిల్లా కార్యదర్శిగా జంగయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ అర్బన్‌, ఆగస్టు 3: సీపీఐ జిల్లా కార్యదర్శిగా పాలమాకుల జంగయ్య మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షాద్‌నగర్‌లోని కేకేఆర్‌  గార్డెన్‌లో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 16వ మహాసభలు బుధవారం ముగిశాయి. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. అలాగే పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తిచేసి, తాగునీటి, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్పడుతున్న కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని, పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా రవీంద్రచారి, పుస్తకాల నర్సింగ్‌రావు, పాలనుగంటి పర్వతాలు, సయ్యద్‌ అఫ్సర్‌, ఎం.యాదయ్య, కె.రామస్వామి, బి.జంగయ్య, ప్రభులింగం, చుందునాయక్‌, టి.రామకృష్ణ, ఎం.శ్రీనునాయక్‌, శేఖర్‌రెడ్డి, నిలమ్మ, పి.లక్ష్మణ్‌, రియాజ్‌, కిషోర్‌ను ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-08-04T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising