ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జక్కేపల్లి ఆర్బీఎల్‌ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగు

ABN, First Publish Date - 2022-06-29T06:04:07+05:30

జక్కేపల్లి ఆర్బీఎల్‌ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగు

ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయకుమారి

యాలాల, జూన్‌ 28: యాలాల మండలం జక్కేపల్లి ఆర్బీఎల్‌ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే చుట్టుపక్కల గ్రామాల రైతులకు, వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని వికారాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయకుమారి అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్‌చార్జి కలెక్టర్‌ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న ధాన్యం ఆధారిత డిస్టలరీ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 90కేఎల్‌పీడీ నుంచి 200కేఎల్‌పీడీ వరకు పెంపు, విస్తరణ 3.0ఎండబ్ల్యూ నుంచి 5.0ఎండబ్ల్యూ వరకు గాను ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే కొత్తగా ఉద్యోగావకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి యువతకు, రైతులకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయన్నారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను బయటికి పంపేలా ప్రత్యేక డ్రెయిన్‌ను ఏర్పాటు చేయించాలని కొందరు రైతులు కోరారని ఇన్‌చార్జి కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌ గోవిందమ్మ, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎన్జీవో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising