మతిస్థిమితం లేని వ్యక్తికి సపర్యలు
ABN, First Publish Date - 2022-05-01T05:40:13+05:30
మతిస్థిమితం లేని వ్యక్తికి సపర్యలు
ఆమనగల్లు, ఏప్రిల్ 30: మతిస్థిమితం లేని వ్యక్తిని కడ్తాల మండల అంబేద్కర్ యువజన సంఘం చేరదీసి సపర్యలు చేసి మానవత్వం చాటుకుంది. కడ్తాల మండల కేంద్రంలో మతి స్థితిమితం సరిగ్గా లేని వ్యక్తి ఏడాది కాలంగా బిక్షాటన చేస్తూ తిరుగుతున్నాడు. దుకాణ ఎదుట సేదతీరుతూ వస్తున్నాడు. చిరిగిన బట్టలు, పెరిగిన జుట్టుతో తిరుగుతున్న ఆవ్యక్తిని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సిద్దిగారి దాసు గమనించి తమ సంఘం సభ్యులతో కలిసి చేరదీశాడు. అతడికి జుట్టు కత్తిరించి, స్నానంచేయించి కొత్త బట్టలు తొడిగారు. ఆ తర్వాత కడుపునిండా భోజనం పెట్టారు. అతడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా అతను మాట్లాడిన బాష అర్థం కాలేదని దాసు తెలిపారు. మతిస్థిమితంలేని అనాథ వ్యక్తిని ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తామని దాసు తెలిపారు. సపర్యలు చేసిన వారిలో కాలే వెంకటేశ్, మంకి మహేశ్, కొప్పు కృష్ణ, సిద్దిగారి మహేశ్, కొప్పు కుమార్, గూడెపు ప్రశాంత్, పోతుగళ్ల మురళి, తుప్పరి రాజు ఉన్నారు.
Updated Date - 2022-05-01T05:40:13+05:30 IST