ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పరిశీలన

ABN, First Publish Date - 2022-10-29T22:51:24+05:30

రాష్ట్ర సాగునీటి శాఖ సలహాదారుడు విజయ్‌ప్రకాష్‌ మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టును శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు ప్రతిపాదించిన పనులపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు అలుగు, తూము, కుడి, ఎడమ, బేబీ కెనాల్‌లను తనీఖీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలను పరిశీలిస్తున్న రాష్ట్ర సాగునీటి శాఖ సలహాదారు విజయ్‌ప్రకాష్‌.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు, అక్టోబరు 29 : రాష్ట్ర సాగునీటి శాఖ సలహాదారుడు విజయ్‌ప్రకాష్‌ మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టును శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు ప్రతిపాదించిన పనులపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు అలుగు, తూము, కుడి, ఎడమ, బేబీ కెనాల్‌లను తనీఖీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా, ఈ ప్రాజెక్టు కింద ధారూరు, పెద్దేముల్‌ మండలాల పరిధిలో 9200 ఎకరాల ఆయకట్టు ఉంది. దెబ్బతిన్న ప్రాజెక్టు అలుగు, పాడైన కెనాల్‌ల మరమ్మతులు, తూములు,షట్టర్‌ పూర్తిగా పాడైపోతే కొత్తవి బిగించుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా దెబ్బతిన్న కెనాల్‌ల వద్ద గైడ్‌వాల్స్‌ నిర్మించుకోవాలని, కాలువలు పూర్తిగా దెబ్బతిన్న చోట కొత్తగా నిర్మించుకునేందుకు ప్రొవిజన్‌ పెట్టుకోవాలని అధికారులకు సలహా ఇచ్చారు. కాగా, ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయింపు ఖరారు కాలేదని సాగునీటిశాఖ అధికారులు తెలిపారు. ఆయన వెంట సాగునీటి పారుదల శాఖ సీఈధర్మ, ఎస్‌ఈ రంగారెడ్డి, ఈఈసుందర్‌, డీఈ భాస్కర్‌, ఏఈ నవీన్‌లు ఉన్నారు.

Updated Date - 2022-10-29T22:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising