పారిశ్రామిక మార్పులను గమనించాలి
ABN, First Publish Date - 2022-12-25T23:43:59+05:30
పారిశ్రామికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలని ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీరాములు అన్నారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 25: పారిశ్రామికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలని ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీరాములు అన్నారు. ఉప్పరిగూడలోని పీవీ రామిరెడ్డి పీజీ కళాశాలలో శనివారం సాయంత్రం ఎంబీఏ 2020-22 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే లో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏటా ఎంబీఏ సిలబ్‌సలో మార్పులు చేస్తున్నామన్నారు. దీంతో మెరుగైన ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పోరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీనివాస్, హెచ్‌వోడీ హెచ్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-25T23:44:00+05:30 IST