ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీహరిశంకర్‌కు ఇండియన్‌ లైబ్రేరియన్‌ ప్రైడ్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-08-14T05:30:00+05:30

శ్రీహరిశంకర్‌కు ఇండియన్‌ లైబ్రేరియన్‌ ప్రైడ్‌ అవార్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా పని చేస్తున్న జి.శ్రీహరిశంకర్‌కు ఇండియన్‌ లైబ్రేరియన్‌ ప్రైడ్‌ అవార్డు -2022 ప్రకటించారు. ఏజీస్‌ ఆఫ్‌ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (ఏకేఏఎం) కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న అనెక్‌డోట్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా గ్రంథాలయాలకు విశిష్ట సేవలు అందిస్తున్న 75 మంది గ్రంథ పాలకులను ఇండియన్‌ లైబ్రేరియన్‌ ప్రైడ్‌ అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు గ్రంథపాలకులు ఎంపిక కాగా, వారిలో పౌర గ్రంథాలయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీహరిశంకర్‌ ఒకరు కావడం విశేషం. గ్రంథాలయాల అభివృద్ధి చేస్తున్న సేవలను గుర్తించింది.  జాతీయ అవార్డు శ్రీహరిశంకర్‌కు రావడం ఇది రెండవసారి. ఇంతకు ముందు శ్రీహరిశంకర్‌కు ఇండియన్‌ పబ్లిక్‌ ల్రైబరీ మూవ్‌మెంట్‌ (ఐపీఎల్‌ఎం) జాతీయ అవార్డు అందజేసింది. వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిశంకర్‌ గత ఏడాది డిప్యూటీ డైరెక్టర్‌ పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ప్రకటించడం పట్ల జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్‌బాబు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising