ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-08-07T06:01:43+05:30

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 6: స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్‌లో వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులో సమీక్ష జరిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు వివి ధ కార్యక్రమాలు చేపడుతామన్నారు. తొలి రోజు సీఎం సందేశం హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రారంభిస్తారని, 9న జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశానికి మండల స్థాయి ముఖ్య అధికారులు హాజరుకావాలన్నారు. 9 నుంచి 21వ తేదీ వరకు అన్ని థియేటర్లలో ‘గాంధీ’ మూవీని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజూ ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రదర్శించే గాంధీ సినిమాకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాటశాలల ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ ఉంచితంగా ప్రవేశం కల్పించాలన్నారు. సామర్థ్యానికి అనుగునణంగా విద్యార్థులను థియేటర్ల వద్దకు తీసుకెళ్లి గాంధీ మూవీని చూపించాలని. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. 10న ప్రతి పంచాయతీ/వార్డు పరిధుల్లో మనమహోత్సవాన్ని చేపట్టి కనీసం 750 చొప్పున మొక్కలు నాటాలని ఆదేశించా రు. ఆ ప్రాంతాన్ని ఫ్రీడం పార్కుగా సంబోధిస్తారన్నారు. 11న మున్సిపల్‌, మండల స్థాయిలో ఫ్రీడం రన్‌, 12న సమైక్యతా రక్షా బంధన్‌, 13న ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఉద్యోగుల ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగరవేయాలని తెలిపారు. 14న జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణస ంచా కాల్చడం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17న జిల్లా కేం ద్రంలో రక్తదాన శిబిరం, 18న ఉద్యోగులు, యువతకు ఫ్రీడం కప్‌ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, 19న అనాథ వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ 20న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని వివరించా రు. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు సంబరాలుంటాయని తెలిపారు. అధికారులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమాలను అనసరిస్తూ వాటి నిర్వహణకు పకడ్బందీ చర్య లు చేపట్టాలన్నారు. 15వ తేదీన ప్రతీ ఇంటిపై త్రివర్ణ ప తాకాన్ని ఎగురవేసేలా ఇంటింటికి జెండాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్వోలు హరిప్రియ, సూర్యలత, విద్యాధికారులు, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T06:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising