ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట
ABN, First Publish Date - 2022-10-18T05:22:26+05:30
ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట
ఆమనగల్లు/కందుకూరు, అక్టోబరు 17: ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనురాధ పత్యనాయక్, మార్కెట్ వైస్‌చైర్మన్ తోట గిరియాదవ్‌లు అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పట్టణానికి చెందిన లండం జంగయ్య రూ.14వేలు, సోనియాకు రూ.24వేలు మంజూరు కాగా సోమవారం స్థానిక మార్కెట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎ్‌స్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్‌గౌడ్, నాయకులు సయ్యద్ ఖలీల్, జయరామ్, కమటం వెంకటయ్య, డేరంగుల వెంకటేశ్, లండం యాదయ్య, పూసల భాస్కర్, రూపం వెంకట్‌రెడ్డి, వంకేశ్వరం భీమయ్య పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులోని పులిమామిడికి చెందిన జె.నరేందర్‌రెడ్డికి మంజూరైన రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును టీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అనేగౌని దామోదర్‌గౌడ్ అందజేశారు. ఆయన వెంట నాయకులు యాదగిరి, దర్శన్, జంగయ్య, నర్సింహ, యాదయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:22:26+05:30 IST