ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనింగ్‌ ఏర్పాటు చేస్తే ఊరుకోం

ABN, First Publish Date - 2022-11-23T23:37:19+05:30

ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా యాచారం మండలంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కల్యాణలక్ష్మి చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమది పేదల ప్రభుత్వం

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం, నవంబరు 23 : ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా యాచారం మండలంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బుధవారం 51 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను ఆయన అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డారు. మైనింగ్‌ ఏర్పాటు చేయడం వలన వ్యవసాయరంగం పూర్తిగా కుంటు పడుతుందన్న విషయం తనకు తెలుసని, ఈ విషయంలో ఎవరిమాటా వినేది లేదని పేర్కొన్నారు. తమది పేదల ప్రభుత్వమని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందుంటానని చెప్పారు. మైనింగ్‌జోన్‌ కోసం అబ్దుల్లాపూర్‌మెట్‌లో 680 హెక్టార్ల భూమి కేటాయించామని తెలిపారు. మెట్రోజోన్‌లో ఉన్న ప్రాంతంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటుకు తానుపూర్తిగా వ్యతిరేకమన్నారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రైతులకు అండగా ఉంటానన్నారు. క్రషర్లు, క్వారీల కారణంగా వాతావరణ కాలుష్యం కావడంతోపాటు పంటలు దెబ్బతింటాయని తెలిసినా అఽధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారో తెలవడం లేదన్నారు. ఈ ఏడాది మండలంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ కింద రూ.14కోట్ల 66లక్షల సాయమందించామని ఎమ్మెల్యే చెప్పారు. మైనింగ్‌పై ఈనెల 26న ప్రజాభిప్రాయసేకరణ సభ ఉందని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో జడ్పీటీసీ జంగమ్మ, తహసీల్దారు సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. ఈసందర్భంగా యాచారం మండలంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-11-23T23:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising