భారీ ఈదురుగాలులు.. నేలకొరిగిన చెట్లు
ABN, First Publish Date - 2022-08-11T05:07:08+05:30
యాచారం మండలంలోని కుర్మిద్దలో
యాచారం, ఆగస్టు 10 : యాచారం మండలంలోని కుర్మిద్దలో బుధవారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి, రెండుగంటల పాటు విద్యుత్సరఫరా నిలిపివేశారు. కుర్మిద్ద, మీర్ఖాన్పేట గ్రామాల మధ్య రోడ్డుపై భారీ చెట్టు కూలిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఆటో డ్రైవర్లు నేలకొరిగిన చెట్లను పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్దరించారు.
Updated Date - 2022-08-11T05:07:08+05:30 IST