ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంచికొట్టిన వాన

ABN, First Publish Date - 2022-05-21T04:52:34+05:30

దంచికొట్టిన వాన

దౌల్తాబాద్‌లో వాననీటిలో వడ్ల కుప్పలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చేతికొచ్చిన దశలో నేలవాలిన వరి, మొక్కజొన్న చేలు
  • గాలి దుమారానికి రాలిన మామిడికాయలు

పరిగి, మే 20: పరిగి సబ్‌డివిజన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్‌ మండలాల్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడిన వర్షానికి వరి చేలు దెబ్బతింటున్నాయి. నాలుగు రోజుల నుంచి రోజూ ఎంతో కొంత వర్షపాతం నమోదవుతోంది. శుక్రవారం భారీగా కురిసింది. చేతికొచ్చిన దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలు నీరు పట్టాయి. వరి, జొన్న చేలు నేలవాలాయి. గాలివానకు తోటల్లో మామిడికాయలు రాలాయి. పరిగిలో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. బీసీ కాలనీ, బహార్‌పేట్‌ చౌరస్తా, తిరుమల వెంచర్‌లో గంటల తరబడి నిలిచిన నీటితో జనం ఇబ్బందిపడ్డారు.


  • కొడంగల్‌ నియోజకవర్గ మండలాల్లో వర్షం


కొడంగల్‌ రూరల్‌/బొంరా్‌సపేట్‌: కొడంగల్‌, బొంరా్‌సపేట్‌ మండలాల్లో వర్షం కురిసింది. ఎండలతో బేజారవుతు న్న జనానికి వర్షంతో ఉపశమనం లభించింది. ఈ వర్షాలతో ముందస్తు దక్కులు చేసుకొని, కట్టె ఏరివేయడం, పొదలు తొలగించే పనులకు రైతులు శ్రీకారం చుడతారు.


  • కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం


దౌల్తాబాద్‌: మండలంలో 2గంటల పాటు కురిసిన వర్షంతో రైతులు ఇబ్బంది పడ్డారు. దౌల్తాబాద్‌లోని వడ్ల కొనుగోలు కేంద్రం ఆవరణలో వడ్ల కుప్పలు తడిసి పోయాయి. ఆర్నెళ్లు పనిచేసి పంట పండిస్తే గాలిలో దీపంలా వడ్లు తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


  • తాండూరులో గంటపాటు ఏకధాటిగా వాన


తాండూరు రూరల్‌: తాండూరులో జోరు వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో గంటపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. పట్టణంలో ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు మెళ్లగా వెళ్లారు.


  • కోట్‌పల్లిలో 9.73సెంటీ మీటర్ల వర్షపాతం 


వికారాబాద్‌/ధారూరు: వికారాబాద్‌ పట్టణం, ధారూరు మండలంలో భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు వాన కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి 7గంటల వరకు కోట్‌పల్లిలో 9.73సెం.మీ వర్షపాతం నమోదైం ది. బొంరా్‌సపేట్‌ మండలం దుద్యాల్‌లో 9.43సెం.మీ, యాలాల్‌ మండలం దావలాపూర్‌లో 8.73, వికారాబా ద్‌ మండలం మదన్‌పల్లిలో 6.25, ధారూరులో 6.23, కులకచర్ల మండలం పుట్టపహాడ్‌, యాలాల్‌ మండ లం ఏఆర్‌ఎ్‌సలో 5.7చొప్పున, పరిగి మండలంరాపోల్‌ లో 4.7, బంట్వారంలో 4.55, బషీరాబాద్‌ మం డలం కాశీంపూర్‌లో 4.4, దోమలో 3.53, తాండూరు 2.7, వికారాబాద్‌ 2.48, పరిగిలో 2.43 సెంటీ మీటర్ల వాన పడింది.

Updated Date - 2022-05-21T04:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising