ఆమనగల్లు చెరువులోకి భారీగా వరద నీరు
ABN, First Publish Date - 2022-10-07T06:15:47+05:30
ఆమనగల్లు చెరువులోకి భారీగా వరద నీరు
ఆమనగల్లు, ఆక్టోబరు 6: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆమనగల్లు సురసముద్రం చెరువులోకి పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. దీంతో చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలుగుసమీపంలో గతంలో పోసిన మట్టి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో పోలీసు, మున్సిపల్‌శాఖల అధికారులు అప్రత్తమయ్యారు. సీఐ జాల ఉపేందర్, ఎస్‌ఐ సుందరయ్య హుటాహుటిన చెరువువద్దకు చేరుకొని మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సాయంతో మట్టి పోయించి చదును చేయించారు. చెరువు పక్కన షాద్‌నగర్ రోడ్డును అనుసరించి ఉన్న నివాసముంటున్న వారిని అప్రమత్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైక్‌లో ప్రక టించారు. అదే విధంగా చెరువు కట్ట ముందు భాగంలో ఉన్న బీసీ కాలనీ వాసులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated Date - 2022-10-07T06:15:47+05:30 IST