జోరుగా చేపల వేట
ABN, First Publish Date - 2022-10-08T04:14:55+05:30
జోరుగా చేపల వేట
కొడంగల్ పెద్ద చెరువు అలుగు నుంచి వస్తున్న నీటిలో చేపలను పడుతున్న స్థానికులు
కొడంగల్‌రూరల్, అక్టోబరు, 7: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో వరద నీరు చేరి అలుగులు పారుతున్నాయి. దీంతో చెరువులోని చేపలు వరద నీటితో పాటు అలుగు గుండా పొలాలకు వచ్చే కాల్వల్లో వస్తున్నాయి. కొడంగల్ పెద్ద చెరువు కింద శుక్రవారం జోరుగా చేపల వేట కొనసాగింది. మండల పరిధిలోని పర్సాపూర్, హస్నాబాద్, గుండ్లకుంట తదితర గ్రామాల నుంచి యువకులు వలలు,తదితర వాటితో చేపలు పట్టుకుని తీసుకెళ్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని చిన్న చెరువు అలుగు పారింది.
Updated Date - 2022-10-08T04:14:55+05:30 IST