ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గీత కార్మికులపై వేధింపులు సరికాదు’

ABN, First Publish Date - 2022-05-24T05:39:40+05:30

‘గీత కార్మికులపై వేధింపులు సరికాదు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ రూరల్‌, మే 23: కొడంగల్‌ ఎక్సైజ్‌ శాఖ పరిధిలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపుల ద్వారా లిక్కర్‌, కల్తీకల్లు వ్యాపారులతో నిజమైన గీత కార్మికులకు అన్యాయం జరుగుతోందని పలుమార్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులకు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని సీపీఐ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ.మహమూద్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం అమ్ముతున్నారని తెలిపారు. న్యాయం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేయడంతో నిజమైన గీత కార్మికులపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులకు దిగడం తగదన్నారు. ఈ నెల 16న సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన తర్వాత గీత కార్మికులపై ఎక్సైజ్‌ శాఖ అధికారుల దాడులు మొదలు పెట్టారని, గతంలో కల్తీకల్లు విక్రయించిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా గీత వృత్తి కార్మికులపైనే కక్షసాధింపులకు పూనుకోవడం సరి కాదన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని, లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2022-05-24T05:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising