బీఆర్ఎస్ నేతల సంబురాలు
ABN, First Publish Date - 2022-10-07T06:13:13+05:30
బీఆర్ఎస్ నేతల సంబురాలు
ఆమనగల్లు/కడ్తాల్/తలకొండపల్లి/కందుకూరు/చౌదరిగూడ/షాద్‌నగర్ అర్బన్/మంచాల/చేవెళ్ల, అక్టోబరు 6: తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిసూ జిల్లాలో పార్టీ బీఆర్‌ఎ్‌స(టీఆర్ఎస్) పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఆమనగల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ప్రధాన రహదారులపై బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయా చోట్ల ర్యాలీలు నిర్వహించారు. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, జడ్పీటీసీలు అనురాధ, దశరథ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివా్‌సయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోనుగోటి అర్జున్‌రావు, శంకర్, పరమేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి బొప్పిడి గోపాల్, నాయకులు దోనాదుల కుమార్, పత్యనాయక్, సయ్యద్ ఖలీల్, సత్యం, గుత్తి బాలస్వామి, తల్లోజు రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి గురువారం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిని కాంక్షించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎ్‌సను స్థాపించారని తెలిపారు. కేశంపేటలో ఎంపీపీ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, తలసాని వెంకట్‌రెడ్డి, మల్లే్‌షయాదవ్, నవీన్‌కుమార్, శ్రీహరి, హరి శేఖర్, సురేష్ యాదవ్, బ్రహ్మచారి, మురళి, రంగారెడ్డి పాల్గొన్నారు. చౌదరిగూడలో పార్టీ మండల అధ్యక్షుడు హఫీజ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బాబురావు, శివ, గూడ స్వామి, టీఆర్ఎస్ శ్రేణులు రాములు, గోపాల్‌రెడ్డి, మన్నే నారాయణ, కోండి యాదయ్య, అక్రం, వెంకటెష్, అజ్మీరి, ఇస్మాయిల్, మాణేయ్య,జహాంగీర్, మోత్య, జభ్బార్ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన సంబురాల్లో ఎంపీపీ ఖాజా ఇద్రీష్, జడ్పీటీసీ సభ్యుడు పి.వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ నటరాజ్, టీఆర్ఎస్ నాయకులు రాంబల్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, జమృద్‌ఖాన్, నక్కల వెంకటే్‌షగౌడ్, కిషోర్, జూపల్లి శంకర్, ఈగ వెంకట్రాంరెడ్డి, పల్లె శ్రీనివా్‌సరెడ్డి, బీష్వ రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, అశోక్, వెంకటే్‌షగుప్త, రాజు పాల్గొన్నారు. అదేవిధంగా మంచాల మండలంలోని ఆరుట్ల బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, ఎంపీటీసీ కావలిశ్రీనివాస్, పున్నంరాము, బైకని మహేందర్, కందాల శ్రీశైలం, చిందం రఘుపతి, ఎండీ.జానీపాష, మారసురేష్, మొర్రి ఐలయ్య పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిర్వహించిన సంబురాల్లో పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సీనియర్ నాయకులు ఎం. కృష్ణరెడ్డి, రంగారెడ్డి, కృష్ణ, గిరిధర్‌రెడ్డి, ప్రభాకర్, నర్సింలు, ఘనీ, ఫయోజీద్దిన్, బుర్ల మహేశ్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-10-07T06:13:13+05:30 IST