గౌడ కులస్థులు రాజకీయంగా ఎదగాలి
ABN, First Publish Date - 2022-12-07T23:41:40+05:30
గౌడ కులస్థులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలి వెంకన్నగౌడ్ అన్నారు.
కులకచర్ల, డిసెంబరు 7: గౌడ కులస్థులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలి వెంకన్నగౌడ్ అన్నారు. బుధవారం కులకచర్లలోని విజయచంద్ర ఫంక్షన్‌హాల్‌లో మండల గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ దగ్గర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వెంకన్నగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్థులు ముందుండి పోరాడారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, స్థానిక గౌడ సంఘం నాయకులు జోగు వెంకటయ్యగౌడ్, ఘనాపూర్ వెంకటయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ కృష్ణయ్యగౌడ్, తిర్మలాపూర్ రాములుగౌడ్, వెంకటయ్యగౌడ్, న్యాయవాది ఆనందంగౌడ్, బాలయ్యగౌడ్, శివకుమార్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, కొండయ్యగౌడ్, తదితరులున్నారు. కులకచర్ల మండల గౌడ సంఘం అధ్యక్షులుగా మాజీ ఎంపీటీసీ మాలె క్రిష్ణయ్యగౌడ్ ఎన్నికయ్యారు. మండల ప్రధాన కార్యదర్శిగా తిర్మలాపూర్ ఎన్.రాములుగౌడ్, ఉపాధ్యక్షులుగా విజయ్‌కుమార్‌గౌడ్, శ్రీనివా్‌సగౌడ్ తదితరులను ఎన్నుకున్నారు.
Updated Date - 2022-12-07T23:42:02+05:30 IST