ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-05-20T05:39:31+05:30

ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదుకోవాలి

యాచారంలో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌/యాచారం, మే 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. గురువారం రవాణారంగం చేపట్టిన ఒక్కరోజు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సీఐటీయూ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఎన్‌.రాజు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో మోటారు వాహనాలచట్టం వాహనరంగంపై భారీ చలానాలు మోపుతోందన్నారు. వాహనరంగంపై తెచ్చిన చట్టంతో వాహన యజమానుల నడ్డి విరుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే శాశ్వత ట్యాక్స్‌ రూ.12వేలకు పెంచుతూ సామాన్య మానువుడి మీద భారం మోపారని విమర్శించారు. కరోనా కారణంగా కొంతమంది వాహన యజమానులు ఫిట్‌నెస్‌ చార్జీలు చెల్లించలేకపోయారని తెలిపారు. ఫిట్‌నెస్‌ చార్జీలు చెల్లించని వాహనయజమానులకు భారీగా చలానాలు విధించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చంద్రమౌళి, శ్రీనూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద సీపీఎం మండల నాయకులు పి.బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రవాణారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. జీవో 714ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజు, శంకరయ్య, వెంకటేష్‌, మల్లేష్‌, యాదయ్య,  పాండు, మైసయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising