ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను లూటీ చేస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-06-27T05:18:34+05:30

దళితులను లూటీ చేస్తున్న ప్రభుత్వాలు

జిల్లా మహాసభలో మాట్లాడుతున్న జాన్‌వెస్లీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ

వికారాబాద్‌, జూన్‌ 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను లూటీ చేస్తున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ ఆరోపించారు. ఆదివారం వికారాబాద్‌లో నిర్వహించిన కేవీపీఎస్‌ జిల్లా మూడో మ హాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. పాలకులు రాష్ట్రంలోని సంపదను అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 19లక్షల మంది దళితులకు దళితబంధు, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని, 101యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 3లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. చిన్నాచితక సంక్షేమ పథకాలిచ్చి దళితులతో చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించడం లేదన్నారు. మున్ముందు ప్రభుత్వాలకు గుణపాఠం నేర్పే విధంగా ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామ న్నారు. ఆర్‌.మహిపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, ఫెడరేషన్ల నాయకులు వెంకటరమణ, సోమప్ప, సుదర్శన్‌, ఎం.వెంకటయ్య, సీహెచ్‌.వెంకటరత్నం, శ్రీనివాస్‌, ఉష, చంద్రయ్య, సతీష్‌, సుభాష్‌, రాములు, తిరుమలయ్య పాల్గొన్నారు. అంతకు ముందు కేవీపీఎస్‌ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2022-06-27T05:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising