వైభవంగా నారాసింహుడి కల్యాణం
ABN, First Publish Date - 2022-10-18T04:27:45+05:30
వైభవంగా నారాసింహుడి కల్యాణం
పరిగి,అక్టోబరు17: పరిగి పట్టణంలోని శ్రీలక్ష్మీనారాసింహస్వామి దేవాలయం వార్షికోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. మూడు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో చివరి రోజు అలయఽ దర్మకర్తలు ఎదిరె మాణెమ్మ, సత్యనారాయణల ఆధ్వర్యంలో గవ్యాంతపూజలు, సుదర్శనమూలమంత్ర హావావనం, మహాపూర్ణాహుతి, యజ్ఞం నిర్వహించారు. అనంతరం స్వామి వారి దివ్యకల్యాణ మహాత్సవాన్ని భక్తుల మధ్య కనులపండువగా నిర్వహించారు. నీరాజనం, మంత్రపుష్ఫములు, రాజోఉపచారములు పండిత ఆశీర్వచనం పండిత సన్మాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.సాయంత్రం పట్టణ వీధుల్లో స్వామి ఊరేగింపు నిర్వహించారు. ముగింపు ఉత్సవంలో పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహార్‌రెడ్డి, పరిగి మునిసిపల్ చైర్మన్ అశోక్ తదితరులు స్వామివారికల్యాణమహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ అన్నదానం చేశారు.కార్యక్రమంలో పరిగి,పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, ఎంపీ మేఘమాల, పురోహితులు సిద్దాంతి పార్థసారథి, మాజీ జడ్పీటీసీ ఎస్‌పి బాబయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు కె.అనిల్‌రెడ్డి, ఆర్.అంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి, కంకల్ ప్రభాకర్, శివనోళ్ళ భాస్కర్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, టి.వెంకటేశ్, వార్ల రవీంద్ర పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:27:45+05:30 IST