అనాథలకు అన్నదానం మహదానందం
ABN, First Publish Date - 2022-12-07T23:56:13+05:30
అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని షాద్‌నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్‌నగర్ అర్బన్, డిసెంబరు 7: అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని షాద్‌నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి జన్మదిన వేడుకను బుధవారం చటాన్‌పల్లి ఎఫ్‌సీఎన్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డిని శంకర్, నాయకులు సన్మానించి, అభినందనలు తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాబర్‌ఖాన్, రఘునాయక్, ఖదీర్, సుదర్శన్, మసూద్‌ఖాన్, ముబారక్, సత్తయ్య, అశోక్, మల్లే్‌షయాదవ్, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:56:15+05:30 IST