నకిలీ వాహన పత్రాలు అమ్ముతున్న ముఠా అరెస్టు
ABN, First Publish Date - 2022-10-07T06:11:46+05:30
నకిలీ వాహన పత్రాలు అమ్ముతున్న ముఠా అరెస్టు
శంషాబాద్, అక్టోబర్ 6: పాత వాహనాలకు నకిలీపత్రాలు సృష్టించి అమ్ముతున్న ఓ ముఠాను శంషాబాద్ రూరల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఈముఠా చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ హసన్‌నగర్‌కు చెందిన అక్రమ్ హర్షద్ అలియాస్ హర్షద్ తన లారీని కాచారం గ్రామానికి చెందిన కాకరకాయల సుధాకర్‌కు గత కొన్ని మాసాల కిందట విక్రయించాడు. అయితే లారీని అమ్మిన వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టిస్తాడని ఓ వ్యక్తి చెప్పడంతో సుధాకర్ అప్రమత్తమై శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంషాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ్ హర్షద్, విజయనగర్‌కాలనీకి చెందిన ఖాలేద్ అక్తర్ అలియా్‌సఖాలేద్, ఫలక్‌నూమాకు చెందిన సయ్యద్‌ఇక్భాల్‌లు ముగ్గురు కలసి ఒక ముఠాగా ఏర్పడ్డట్లు పోలీసుల దర్యాప్తతలో తేలింది. ఈముఠా కాలం చెల్లిన పాతవాహనాలకు అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో నకిలీపత్రాలు సృష్టించి ఆవాహనాలను విక్రయించే వారని తేలింది. దీంతో ఆముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
Updated Date - 2022-10-07T06:11:46+05:30 IST