ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులొచ్చాయ్‌!

ABN, First Publish Date - 2022-03-06T04:17:06+05:30

నిధులొచ్చాయ్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ఎమ్మెల్యే నిధులు విడుదల
  • వికారాబాద్‌ జిల్లాకు రూ.20కోట్లు రాక
  • నియోజకవర్గానికి రూ.5కోట్ల చొప్పున..
  • గడువు 25రోజులే... వేగంగా పనులుచేయాల్సిందే
  • గామస్థాయి లీడర్లకు పనులు

తాండూరు, మార్చి5: నియోజక్గవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు నిధులు మంజూరయ్యాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులను ఆర్థికశాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గానికి రూ.5కోట్ల చొప్పున వికారాబాద్‌ జిల్లాకు రూ.20కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) కింద తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాలకు ఈనిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. మిగతా మూడు కోట్లు అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది.  ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు ప్రభుత్వం కేటాయించాలి. కాగా ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తుంది. గడువు మిగిలింది 25 రోజులే. పనులు ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు చేయించాలి, రికార్డులు ఎప్పుడు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. కనీసం నెలరోజుల గడువు అయినా ఉండాలని కోరుతున్నారు. మరి ఈ సారినిధులు మురిగిపోవద్దని సూచించడం విశేషం.

లీడర్లకు  అవకాశం

గ్రామాల వారీగా నిధులు కేటాయిస్తే గ్రామానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల నిధులు వచ్చే అవకాశాలున్నాయి.  రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామస్థాయిలో బలం పెంచుకునే దిశలో ఎమ్మెల్యేలు నామినేషన్‌ పద్దతిన ఈనిధులును గ్రామస్థాయి లీడర్లకు కేటాయించే ఛాన్స్‌ ఉంది. గతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చిన పనులకు ఈ నిధులు కేటాయించనున్నారు.

బడుల బాగుకు ఎమ్మెల్యే నిధులు

పాఠశాలల అభివృద్ధి పర్చడానికి సీడీపీ నిధులను వ్యయం చేయనున్నారు. సీడీపీ నిధుల్లో రూ.2కోట్లు బడులఅభివృద్ధి కేటాయించాలని సూచించారు. మొదటిదశలో అభివృద్ధి చేయాల్సిన స్కూళ్లను మండలం యూనిట్‌గా ఎంపిక చేయనున్నారు. 12 అంశాలలో కొన్నింటిని ఈ నిధులు కేటాయిస్తారు. 25శాతం మేరకు నిధులు కేటాయించనున్నారు. అవసరమైన చోట కొత్త భవనాలు, అదనపు గదుల నిర్మాణం, మరమ్మతులు, ప్రహరీలు, తాగు నీటి సౌకర్యం వంటి పనులు చేపట్టనున్నారు.

Updated Date - 2022-03-06T04:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising