ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2022-12-10T00:21:10+05:30

30వ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రె్‌స-2022ను ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో సుశీందర్‌రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ మండలం రంగాపూర్‌లోని నాట్కో హైస్కూల్లో నిర్వహణ

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 9 : 30వ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్‌ కాంగ్రె్‌స-2022ను ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో సుశీందర్‌రావు తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్‌లోని నాట్కో హైస్కూల్‌లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 33 జిల్లాల నుంచి జిల్లా స్థాయిలో ఎంపికైన ఐదు ఉప అంశాలకు చెందిన 174 ప్రాజెక్టులు ఈ సైన్స్‌ కాంగ్రె్‌సలో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు న్యాయ, ఎండోమెంట్‌, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ శాస్త్ర సాంకేతిక, సమాచార విభాగం (ఎన్‌సీఎ్‌సటీసీ), రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ-రాష్ట్ర విద్యాశిక్షణ-పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సైన్స్‌ కాంగ్రె్‌సలో ఎంపికైన ప్రాజెక్ట్‌ జాతీయ స్థాయికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-10T00:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising