ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2022-09-28T05:06:11+05:30

కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట

కొత్తగూడ సున్నం చెరువులో చేపపిల్లలను వదులుతున్న జంగారెడ్డి, జ్యోతి, నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, సెప్టెంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లను మండలంలోని కొత్తగూడ సున్నం చెరువులో ఎంపీపీ మంద జ్యోతి, వైస్‌ ఎంపీపీ జి.శమంతప్రభాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్‌ సాధ మల్లారెడ్డిలతో కలిసి మంగళవారం వదిలారు. మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చొరవతో మండంలోని 34చెరువులు, కుంటల్లో 12లక్షల చేపపిల్లలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, నాయకులు సామ ప్రకాశ్‌రెడ్డి, అనేగౌని దామోదర్‌గౌడ్‌, బి.సత్యనారాయణరెడ్డి, ఆర్‌.యాదయ్య, కుమ్మరి కృష్ణయ్య పాల్గొన్నారు. కాగా, మండలంలోని లేమూరు గ్రామానికి చెందిన భూపతికి మంజూరైన ‘దళితబంధు’ నిధులతో గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వెల్డింగ్‌ షాపును జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ శ్రీలతశ్రీహరి, నాయకులు దామోదర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising