క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టిసారించాలి
ABN, First Publish Date - 2022-12-16T23:02:44+05:30
ద్యార్థులు క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టిసారించాలని కార్మిక ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్, కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 12వ అంతర్జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి) : విద్యార్థులు క్లౌడ్ కంప్యూటింగ్‌పై దృష్టిసారించాలని కార్మిక ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్, కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 12వ అంతర్జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఙానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమయాన్ని, డబ్బను వృధా చేసుకోవద్దని, కాలంతో పాటు పరుగెత్తాలన్నారు. పోటీ ప్రపంచంలో క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టంకు ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. ఎన్‌బీఎ ( నేషనల్ బోర్డు అఫ్ అక్రిడియేషన్) చైర్మన్ కె.కె అరగ్వాల్‌కు జ్ఙాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ యాజమాన్యం చామకూర మల్లారెడ్డి, శైలజరెడ్డి, అభినవ్‌రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:02:45+05:30 IST