ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-10-12T05:09:31+05:30

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌/తలకొండపల్లి/యాచారం, అక్టోబరు 11: మండలంలోని మైసిగండికి చెందిన సుశీల, లచ్య, గోపాల్‌లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాలను మంగళవారం జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ పరామర్శించారు. జర్పుల రాధాకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున రూ.15వేలు ఆర్థికసాయం అందజేశారు. పరామర్శించిన వారిలో రైతు సమన్వయ సమితి  మండల కో-ఆర్డినేటర్‌ జోగు వీరయ్య, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ లాయక్‌అలీ, వినోద్‌, శంకర్‌, సోమ్ల, రాము ఉన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన మీసాల శ్రీను అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్‌ పరామర్శించారు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సమకూర్చిన రూ.3వేలు బాధిత కుటుంబానికి ట్రస్ట్‌ సభ్యులు అందజేశారు. పరామర్శించిన వారిలో శ్రీశైలంగౌడ్‌, మధు, పరమేశ్‌, మహేశ్‌, పెంటయ్య ఉన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని తాడిపర్తిలోని ఎర్రకుంటలో ఈత కోసం వెళ్లి   నలుగురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను మంగళవారం పగడాల కనకయ్య ఫౌండేషన్‌ ట్రస్ట్‌చైర్మన్‌ ముత్తు ఆర్థికంగా ఆదుకున్నారు. ఖాసీం కుటుంబానికి రూ.20వేలు, హుస్సేన్‌ కుటుంబానికి రూ.10వేలు, రజాక్‌ కుటుంబానికి రూ.10వేల చొప్పున నగదు అందించారు. అదేవిధంగా కుందారపు మధు ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున నగదు అందజేశారు. 

Updated Date - 2022-10-12T05:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising