ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీలను భర్తీ చేయండి

ABN, First Publish Date - 2022-01-28T04:56:35+05:30

ఖాళీలను భర్తీ చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, జనవరి 27: మండలంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు కోరారు.  ఖాళీల వల్లనే ఏ పనులు పూర్తి చేయలేకపోతున్నామని చెప్పారు. మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో వైస్‌ ఎంపీపీ అనురాధ అధ్యక్షతన జరిగింది. అధికారులు పూర్తి స్థాయిలో  సమావేశానికి హాజరుకాకపోవడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గత సమావేశంలో చర్చించిన విద్యుత్‌ సమస్యలు పరిష్కారం కాకాపోవడం పట్ల సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కొలతలు తీసుకుని స్కూల్‌ డ్రెస్‌లను ఇవ్వాలని పాపిరెడ్డిగూడ సర్పంచ్‌ తాండ్ర విష్ణువర్థన్‌రెడ్డి సభదృష్టి తీసుకువచ్చారు. అయితే సిబ్బంది కొరతతో పనులు చేయలేక పోతున్నామని, మండలంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయించేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అధికారులు విజప్తి చేశారు. వేసవిలో అన్ని గ్రామాల్లో ఉపాధిపనులు ప్రారంభిస్తామని ఎక్కువ సంఖ్యలో కూలీలు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యులను ఉద్ధేశించి జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో రవిచంద్రారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ నారాయణరెడ్డి, జగదీశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising