న్యాయం జరిగేవరకూ పోరాటం
ABN, First Publish Date - 2022-09-12T05:18:54+05:30
తమకు న్యాయం జరిగే వరకు భూపోరాటం ఆపమని
షాబాద్, సెప్టెంబరు 11 : తమకు న్యాయం జరిగే వరకు భూపోరాటం ఆపమని చందన్‌వెళ్లి భూనిర్వాసితులు అన్నారు. 43 రోజులుగా తమకు న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్ష చేపట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై భూనిర్వాసితులు ఆదివారం కళ్లకు గంతులు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయపరంగా తమకు రాల్సిన భూపరిహారం తమకు అందే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామన్నారు. అక్రమార్కులు తమ పరిహారాన్ని తిని, జల్సాలు చేస్తుంటే తాము ఉపవాసాలతో నిరాహారదీక్షను చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అనంతం, శోభ, అంతయ్య, బాలయ్య, భాగ్యమ్మ, అంజయ్య, దయాకర్, జంగయ్య, నర్సింహులు, యూసుఫ్ ఉన్నారు.
Updated Date - 2022-09-12T05:18:54+05:30 IST