ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-12-07T23:45:12+05:30

మున్సిపాలిటిలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌, డిసెంబరు 7: మున్సిపాలిటిలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎన్‌సీడీ కిట్లను వైద్య సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఎంపీపీ ముద్దప్పదేశ్‌ముఖ్‌, సర్పంచ్‌లు సయ్యద్‌అంజద్‌, బీ.పకీరప్ప, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, మాజీసర్పంచ్‌ రమేశ్‌బాబు, నాయకులు నరోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేను కొడంగల్‌ నియోజకవర్గ ముదిరాజ్‌ సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో కలిశారు. కొడంగల్‌ పట్టణ శివారులోని సిద్దనొంపు దగ్గర కేటాయించిన స్థలంలో ముదిరాజ్‌ భవన నిర్మాణం పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ముదిరాజ్‌ సంఘం నాయకుడు, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ యం.కృష్ణ, నర్సిములు, నారాయణ, బాల్‌రాజ్‌ తదితరులు ఎమ్మెల్యేను కలిసినవారిలో ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising