ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : చంద్రశేఖర్‌

ABN, First Publish Date - 2022-08-04T05:57:59+05:30

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : చంద్రశేఖర్‌

బ్రిడ్జిని పరిశీలిస్తున్న మాజీమంత్రి చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్పల్లి, ఆగస్టు 3 : పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం మండలంలోని దామస్తాపూర్‌, షాపూర్‌, కల్కోడా గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, బ్రిడ్జీని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మర్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు చేస్తున్న పనులపై బీజేపీ యువకులు ప్రశ్నిస్తుంటే.. వారిపై అధికార బలంతో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా, వారిపై దాడులు చేసినా ఇకపై సహించేదిలేదని చంద్రశేఖర్‌ తెలిపారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్‌, నాయకులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌, ప్రవీణ్‌గౌడ్‌, మధు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising