ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవేం.. గోనె సంచులు!

ABN, First Publish Date - 2022-05-25T05:16:51+05:30

ఇవేం.. గోనె సంచులు!

సుల్తాన్‌పూర్‌లో చిరిగిపోయిన గన్నీ బ్యాగులను చూపిస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సుభా్‌షచందర్‌రెడ్డి, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  చిరిగిపోయిన  గన్నీ బ్యాగులతో రైతుల కష్టాలు

పరిగి, మే 24: రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి. తరుగు,తాలు మాట అటుంచితే గన్నీబ్యాగులే పెద్ద సమస్యగా మారాయి. సరఫరాలో అసలే కొరత.. అందులోనూ చినిగిపోయిన గన్నీబ్యాగులను సరఫరా చేస్తున్నారు. రైతులు వడ్లు నింపడానికి వీల్లేకుండా ఉంటున్నాయని రైతులు  వాపోతున్నారు.  రైతులు పండిన వడ్లను  బస్తాల్లో నింపేందుకు కేంద్రాల నుంచి గన్నీబ్యాగుల బెండల్స్‌ను తెచ్చుకుంటున్నారు. అయితే బెండల్స్‌ను విప్పి చూడగా, సగానికిపై దెబ్బతిన్న బ్యాగులే ఉండడంతో ఎలా నింపాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 111 కేంద్రాల పరిధిలో 8 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందుకు జిల్లాకు 20 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉంది. ప్రస్తుతంలో జిల్లాలో  11 లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులోనూ సగానికిపైగా పనికిరాని బ్యాగులే ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్కో గన్నీబ్యాగును ప్రభుత్వం రూ.53 పెట్టి కొనుగోలు చేస్తున్నది. రెండోసారి వాడింది అయితే రూ.26, మూడోసారి వాడింది అయితే రూ.13 ధర చెల్లిస్తున్నారు. అయితే పాత సంచులు సరఫరా చేసి, కొత్త సంచులని రికార్డులో చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గన్నీబ్యాగుల కొనుగోళ్లలో కూడా అధికారులు అక్రమాలకు పాల్పడుతన్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే సంచులు  అంతంతమాత్రమే... అందులోనూ పనికిరాని బ్యాగులతో ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు రైతులతో ఆటలాడుకుంటున్నా కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు  బి.సుభా్‌షచందర్‌రెడ్డి విమర్శించారు. గన్నీ బ్యాగులతో కూడా అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు నాణ్యమైన గన్నీబ్యాగులు పంపించాలని, లేనిచో కాంగ్రెస్‌ పార్టీ అధ్యర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2022-05-25T05:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising