2 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు
ABN, First Publish Date - 2022-10-18T04:33:09+05:30
జిల్లాలో 2 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పబ్లిక్ రీడింగ్
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 17 : జిల్లాలో 2 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పఠన మందిరాలు (పబ్లిక్ రీడింగ్ రూమ్స్) ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వసతిలేని గ్రామాల్లో కంటైనర్ ఏర్పాటు చేయాలని తీర్మానం ద్వారా నిర్ణయించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచన మేరకు వనస్థలిపురం గ్రంథాలయ నూతన భవన నిర్మాణం కోసం రూ.1.40కోట్లు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరిక మేరకు చేవెళ్ల గ్రంథాలయ నూతన భవన నిర్మాణం కోసం రూ.2కోట్ల నిధులు మంజూరు చేయాలని తీర్మానం చేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో, మండల కేంద్రాల్లో గ్రంథాయాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ సభ్యులు ఏనుగు ఆనంద్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్‌సరెడ్డి, వయోజన విద్య ఉపసంచాలకులు గణేష్, జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి పద్మశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:33:09+05:30 IST