ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెరవేరని కల!

ABN, First Publish Date - 2022-11-15T00:36:29+05:30

మొగిలిగిద్ద గ్రామస్తుల దశాబ్దాల కల నెరవేరడం లేదు. మండల కేంద్రంగా చేయాలని ఆందోళనలు, దీక్షలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

స్వాతంత్ర్యానికి ముందే ఏర్పాటు చేసిన పోస్టాఫీస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దశాబ్దాలుగా నెరవేరని మొగిలిగిద్ద మండల కేంద్రం ఏర్పాటు

చారిత్రక గ్రామానికి దక్కని గౌరవం

స్వాతంత్ర్యానికి ముందే పోలీస్‌స్టేషన్‌, పోస్టాఫీసు, పాఠశాల ఏర్పాటు

100 రోజులు దీక్ష చేసినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

మొగిలిగిద్ద గ్రామస్తుల దశాబ్దాల కల నెరవేరడం లేదు. మండల కేంద్రంగా చేయాలని ఆందోళనలు, దీక్షలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామంపై సర్కార్‌ చిన్నచూపు చూస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ లాభం కోసం కొన్నింటిని మండలాలుగా మార్చుతున్నారు. కానీ మొగిలిగిద్దను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షాద్‌నగర్‌రూరల్‌, నవంబరు 14: ఘనచరిత్ర కలిగిన ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే గ్రామస్తుల చిరకాల కోరిక కలగానే మిగిలిపోతోంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నిజాం నవాబులకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడిన తుర్రేబాజ్‌ఖాన్‌ వారి నుంచి తప్పించుకునే క్రమంలో మద్రా్‌సకు వెళ్తూ మార్గమధ్యలో మొగిలిగిద్ద గ్రామంలో ఆశ్రయం పొందారు. సమాచారం తెలుసుకున్న నిజాం నవాబులు ఆయనను పట్టుకెళ్లి చంపేశారు. దాంతో అప్రమత్తమైన నవాబులు మొగిలిగిద్దలో తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరగకుండా మొదట పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సమాచార వ్యవస్థ కోసం పోస్టాఫీసు నెలకొల్పారు. పిల్లలు హింసా మార్గాన్ని ఎంచుకోకుండా చదువు వైపు మళ్లేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. నాడు నిర్మించిన భవనాలు గ్రామంలో నేటికీ చెక్కు చెదరలేదు.

మహనీయులు చదివిన పాఠశాల

దేశానికి, రాష్ట్రానికి సేవలందించిన ఎంతో మంది మహనీయులు మొగిలిగిద్దలో విద్యనభ్యసించారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలందించిన అన్నారం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి, నేటి పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి వారే కాకుండా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఈ గ్రామంలో చదువుకున్న వారిలో ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ చదివి దేశ, విదేశాల్లో స్థిర పడ్డారు.

పోలీస్‌ స్టేషన్‌ కొందుర్గుకు తరలింపు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో (1985) కొందుర్గును మండల కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మొగిలిగిద్దలోని పోలీ్‌సస్టేషన్‌ను కొందుర్గుకు తరలించారు. సదరు భవనంలో తుర్రేబాజ్‌ఖాన్‌ పేరుతో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయగా.. పోస్టాపీసు నేటికి కొనసాగుతుంది.

కొత్త మండలాల ఏర్పాటుతో ఆశలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసింది. దాంతో మొగిలిగిద్ద గ్రామం మండలంగా ఏర్పాటు చేస్తారని గ్రామస్తులు ఆశించారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. కానీ గ్రామస్తుల కోరికను పరిగణనలోకి తీసుకోలేదు. తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పార్టీలకతీతంగా వంద రోజుల నిరాహార దీక్షలు కూడా చేశారు. దీక్షలు జరుగుతున్న కాలంలోనే ప్రభుత్వం మరి కొన్ని మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. కానీ మొగిలిగిద్ద గ్రామాన్ని పట్టించుకోలేదు. దాంతో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గ్రామస్తుల చేత దీక్షలు విరమింపజేశారు. ఇటీవల సర్పంచ్‌తో పాటు గ్రామానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు మొగిలిగిద్దను మండలం చేయాలని తమ పదవులకు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ టీఆర్‌ఎ్‌సలో చేరారు. రాజీనామాలు ఆమోదించబడలేదు. మొగిలిగిద్ద మండలం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నపుడు చించోడును కూడ మండలం చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్‌ చేయడంతో ఉద్యమం నీరుగారి పోయింది.

మునుగోడులో కొత్తగా గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు

మునుగోడుకు జరిగిన ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు కొత్తగా గట్టుప్పల్‌ మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. రాజకీయ కోణంలో ఆలోచించి అక్కడ మండలాన్ని ఏర్పాటు చేసిన సర్కార్‌ చారిత్రక గ్రామమైన మొగిలిగిద్దను విస్మరించడం విచారకరమని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం మరోమారు ఆలోచించి మొగిలిగిద్దను మండల కేంద్రంగా చేయాలని కోరుతున్నారు.

విస్మరించడం బాధాకరం

చారిత్రక గుర్తింపు కలిగి, అన్ని అర్హతలున్న మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రం చేయకుండా విస్మరించడం బాధాకరం. వంద రోజులు నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం. ఇప్పటికైనా గుర్తించాలి.

- వెంకటే్‌షగుప్తా, మొగిలిగిద్ద

చిరకాల కోరికను నెరవేర్చాలి

మొగిలిగిద్ద మండల కేంద్రం కావాలని గ్రామస్తుల చిరకాల కోరిక. పార్టీలకతీతంగా వంద రోజులు నిరాహార దీక్ష చేశాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొగిలిగిద్ద గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా గుర్తించాలి.

- గడ్డం శ్రీనివాస్‌, మొగిలిగిద్ద

Updated Date - 2022-11-15T00:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising