ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం

ABN, First Publish Date - 2022-08-08T05:41:21+05:30

జిల్లావ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష

ఇబ్రహీంపట్నం సెయింట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద అభ్యర్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 19 కేంద్రాల్లో 11,085 మంది అభ్యర్థులు హాజరు


రంగారెడ్డి అర్బన్‌/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్‌ రూరల్‌ , ఆగస్టు 7 : జిల్లావ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సై రాత పరీక్షకు 19కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,760 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 11,085 మంది హాజరయ్యారు. 1,675మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు అభ్యర్థులు సరైన సమయానికి చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలో 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 8,760 మంది అభ్యర్థులకుగాను 7,585 మంది పరీక్షలు రాశారు. 1,175 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొయినాబాద్‌ మండలంలోని జేబీఐఈటీ ఇంజనీరింగ్‌ కళాశాల, కేజీరెడ్డి ఇంజనీరింగ్‌, గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ నాలుగు పరీక్ష కేంద్రాల్లో దాదాపు 4వేల మందికిగాను 3,500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు, సీఐ సైదులు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.  



Updated Date - 2022-08-08T05:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising