ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సహకరించాలి

ABN, First Publish Date - 2022-12-15T23:01:52+05:30

మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి తొమ్మిది నెలల వయసున్న శిశువుల నుంచి 15సంవత్సరాల పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్‌ వేసేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

వికారాబాద్‌, డిసెంబరు 15: మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి తొమ్మిది నెలల వయసున్న శిశువుల నుంచి 15సంవత్సరాల పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్‌ వేసేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ కోరారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో మెదడు వాపువ్యాధి నియంత్రణకు సంక్షేమ శాఖల అధికారులు, ఎంఈవోలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సీడీపీవోలతో ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేసేలా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి ఐదేళ్ల పిల్లల వివరాలు, స్కూళ్లలో 6 సంవత్సరాల నుంచి 15సంవత్సరాల పిల్లల పూర్తి వివరాలు అందజేయాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కుడి కాలుకు, 15సంవత్సరాలలోపు పిల్లలకు కుడిచేతి రెట్టకు టీకాలు వేస్తారన్నారు. వ్యాక్సినేషన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, సురక్షితమైందని తెలిపారు. రోజూ ఒక ఏఎన్‌ఎం 100మంది పిల్లలకు టీకాలు వేసేలా చూడాలన్నారు. పిల్లల తల్లిదండ్రులకు జేఈ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి ప్రతీ ఒక్కరూ వ్యాక్సినే వేసుకునేలా పనిచేయాలని సూచించారు. సంబంధిత శాఖల వారి పరిధి విద్యార్థుల వివరాలను అందజేసి వ్యాక్సినేషన్‌ పూర్తికి సహకరించాలన్నారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో జేఈ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారి జీవరాజ్‌, జిల్లా సంక్షేమ అధికారులు కోటాజీ, లలితకుమారి, వైద్యశాఖ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising