ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

ABN, First Publish Date - 2022-10-07T05:49:46+05:30

గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పట్టించుకోని అధికారులు 
  • గ్రామస్తులకు తప్పని ఇబ్బందులు

తాండూరు రూరల్‌, అక్టోబరు, 6 : తాండూరు మండలం మండల పరిధిలోని దాదాపు పది గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల పరిధిలోని మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, రాంపూర్‌, రాంబాపూర్‌మీదితండా, రాంపూర్‌కింది తండా, బెల్కటూర్‌, చంద్రవంచ, చిట్టిఘనాపూర్‌ గ్రామాల్లో బుధవారం అర్థరాత్రి 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. గురువారం సాయంత్రం 6 గంటలు గడిచినా విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా చేయలేదు. ఈ విషయంపై ఆయా గ్రామాల విద్యుత్‌ లైన్‌మెన్లకు ఫోన్లు చేసినప్పటికీ స్వీచ్‌ ఆఫ్‌ ఉన్నాయని ఆయా గ్రామస్తులు విద్యుత్‌ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు మండల విద్యుత్‌ శాఖ అధికారి గ్రామాల్లో సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్లనే తరచూగా విద్యుత్‌ అంతారం కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరాను త్వరలో పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని  హెచ్చరించారు. ఈ విషయంపై విద్యుత్‌ శాఖ అధికారిని ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ వచ్చింది.


Updated Date - 2022-10-07T05:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising