విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-08-04T05:42:36+05:30
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
షాబాద్, ఆగస్టు 3: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్‌తో ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి అధ్యక్షతన వైస్‌ఎంపీపీ లక్ష్మీరాజేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ సైదులులతో కలిసి సమావేశం నిర్వహించారు. చిన్న వాన కురిసినా కరెంట్ కట్ చేస్తున్నారని, వైర్లు కిందకి వేలా డుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ముద్దెంగూడ, పెదవేడు సర్పంచ్‌లు జయమ్మ, శ్రీనివా్‌సగౌడ్‌లు సభలో మాట్లాడారు. పెదవేడులోని సమస్య పరిష్కారానికి ఐదు స్తంభాలు పంపిస్తే సర్పంచ్ సొంతానికి వాడుకున్నారని ట్రాన్స్‌కో ఏఈ నరేందర్ అనడంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దెబ్బతిన్న పంటలను వివరాలను ఉన్నతాధికారులకు పంపాలని వ్యవసాయాశాఖ అధికారులను కోరారు. 70శాతం రాయితీపై పశువులకు మేత గడ్డి విత్తనాలు ఉన్నాయని పశువైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ... అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. వర్షాకాల ంలో పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. కార్యక్రమంలో ఏవో వెంకటేశం, ఎంఈవో శంకర్‌రాథోడ్, ఎంపీ వో హన్మంత్‌రెడ్డి, నర్సింహులు, వైద్యులు వరలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈలు నరేందర్, శారద, విద్యాసాగర్, ఎపీవో వీరాసింగ్, పీఆర్‌డిఈ విజయ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంటీసీలు, పంచాయితీరాజ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:42:36+05:30 IST