ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన కార్యవర్గం ఎన్నిక

ABN, First Publish Date - 2022-11-28T00:10:19+05:30

రెడ్డిసేవా సంఘం తలకొండపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తలకొండపల్లి: నూతన కార్యవర్గంతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి/షాద్‌నగర్‌అర్బన్‌/కొందుర్గు నవంబరు 27: రెడ్డిసేవా సంఘం తలకొండపల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవిక గార్డెన్‌లో సంఘం మండల సమావేశాన్ని ఆవంచ చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, తాలుకా అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు శేఖర్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధ్యక్షులుగా డోకూరి ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా గాదె రేణురెడ్డి, పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భగవాన్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఎడ్ల చంద్రారెడ్డి, బండెల సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా ఎన్నేండ్ల వెంకట్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా మేక శ్రీనివా్‌సరెడ్డి, కార్యవర్గసభ్యులుగా దోమ మోహన్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, యాదగిరిరెడ్డిలు ఎన్నికయ్యారు. అదేవిధంగా షాద్‌నగర్‌ డివిజన్‌లోని కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల రెడ్డి సేవా సమితి నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్‌ బీఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం రెడ్డి సేవా సమితి షాద్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు కొప్పుల మధన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సేవా సమితి కొందుర్గు మండల అధ్యక్షుడిగా లంకాల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివా్‌సరెడ్డి, కోశాధికారిగా రాయికంగటి కృష్ణారెడ్డి, జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షుడిగా నాగారం వెంకట్రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నారం వెంకట్‌ నర్సింహారెడ్డి, కోశాధికారిగా ఎంకెపల్లి సత్యనారాయణరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు సింగిల్‌ విండో చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రవీందర్‌రెడ్డి, ఎం.నర్సింహారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising