ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజనుడు సీఎం అయ్యేందుకు కృషి

ABN, First Publish Date - 2022-07-07T05:47:47+05:30

బహుజనుడు సీఎం అయ్యేందుకు కృషి

మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 

చేవెళ్ల, మొయినాబాద్‌ రూరల్‌, జూలై 6: తనకు సీఎం పదవిపై ఆశలేదని, తెలంగాణలో బహుజనుడు సీఎం అయ్యేందుకు బీఎస్పీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన బీఎస్పీ పల్లెబాటయాత్రలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై నీలిజెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ ముందుకు సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ అహంకార పూరిత దొరలపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా బీఎస్పీ పోరాడుతుందన్నారు. ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు ఎకరా చొప్పున భూమి ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములకు పట్టాలను ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జీవో 111 పరిధిలో ఉన్న భూములన్నీ దొరల చేతుల్లో ఉన్నాయన్నారు. భారత సైన్యాన్ని బలహీన పరిచే ‘అగ్నిపథ్‌’ను బీఎస్పీ వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే స్థితిలో లేదని విమర్శించారు. సమావేశానికి ముందు గొల్లపల్లిలో హెచ్‌ఎం నర్సింహులు విగ్రహాన్ని ఆయన కుటుంబసభ్యులతో కలిసి ప్రవీణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం మండలకేంద్రంలో రాత్రి ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా హిమయత్‌ నగర్‌ చౌరస్తాలో ఆర్‌.ఎస్‌ ప్రవీన్‌ కుమార్‌ బీఎస్పీ పార్టీ జెండాను అవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.లింగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి సుజాత, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి విజయసూర్య, అబ్రహం లింకన్‌, అంజి, రాజేశ్వర్‌, నాయకులు జామ చంద్రం, శ్రీశైలం, అనంతయ్య, చందు, రాజామహేంద్రవర్మ ఉన్నారు. 

Updated Date - 2022-07-07T05:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising