ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-12-13T00:07:40+05:30

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న పీఆర్‌టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. సోమవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో కలిసి నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జడ్పీ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా పీఆర్‌టీయూటీఎస్‌ కృషిచేస్తోందన్నారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కమలాకర్‌రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీ యూటీఎస్‌ పోరాటాలు చేస్తోందన్నారు. సంఘం సాధించిన విజయాలు, జీవోల గురించి వివరించారు. కార్యక్రమంలో సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.నర్సిములు, బాబ్యానాయక్‌, నాయకులు మారుతి, ఎం.శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, రవీందర్‌రెడ్డి, ఎం.అశోక్‌, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising