ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం ఏర్పాటుకు కృషి

ABN, First Publish Date - 2022-01-23T05:16:31+05:30

బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం ఏర్పాటుకు కృషి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాండూరు రూరల్‌, జనవరి 22 : తాండూరు మండలం మిట్టబాస్పల్లి గ్రామంలో మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. మిట్టబాస్పల్లిలో జగ్జీవన్‌రాం విగ్రహం ఏర్పాటుకు శనివారం భూమిపూజ చేశారు. కాగా, సర్పంచ్‌ పట్లోళ్ల నరేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కొంతమంది కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరగా.. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామంలోని కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీలో నుంచి మాజీ ఉపసర్పంచ్‌ నరహరి, పెంటయ్యగౌడ్‌, మహేందర్‌పటేల్‌, వెంకటయ్య, నవీన్‌, శ్రీనివా్‌సరెడ్డి, చిన్న నర్సింహులు, హకీంతోపాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాందాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ రాంలింగారెడ్డి, సీనియర్‌ నాయకులు ఉమాశంకర్‌, ఎంపీటీసీ సాయిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు రాములు, బిజ్వార్‌ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, నాయకురాలు శకుంతల, మాజీ సర్పంచ్‌ షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

  • ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తాండూరు పట్టణంలోని సెయింట్‌మార్క్స్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో శనివారం తాండూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించారు. క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సంపత్‌, నర్సింహులు, రాజుగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నయీం, నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-01-23T05:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising