బీసీల విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T00:25:12+05:30
బీసీల విద్యాభివృద్ధికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్ కేంద్ర బీసీ కమిషన్ చైర్మన్ గంగాధర్‌ను కోరారు.
పరిగి, డిసెంబరు 14: బీసీల విద్యాభివృద్ధికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్ కేంద్ర బీసీ కమిషన్ చైర్మన్ గంగాధర్‌ను కోరారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో రాజ్యసభసభ్యుడు ఆర్.కృష్ణయ్యతో పాటు వెళ్లి గంగాధర్‌ను కలిశారు. తెలంగాణలో బీసీల విద్యాభివృద్ధిపై కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లాల్‌కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో బీసీల సంక్షేమ గురించి పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా సీఎం కేసీఆర్ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గంగాధర్‌కు తెలిపారు. బీసీల కోసం మండలానికో బీసీ బాలుర, బాలికల రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలు, బీసీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గంగాధర్‌ను కోరినట్లు లాల్‌కృష్ణ ప్రసాద్ తెలిపారు.
Updated Date - 2022-12-15T00:25:13+05:30 IST