ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాంబండ ఆలయం అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2022-12-02T00:08:22+05:30

కులకచర్ల : పాంబండ ఆలయంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి

కులకచర్ల : పాంబండ ఆలయంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, డిసెంబరు 1: పాంబండ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డిలు తెలిపారు. గురువారం మండల పరిఽధిలోని బండవె ల్కిచర్ల గ్రామ పాంబండ దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ నిధులు రూ.50లక్షలతో నిర్మించే ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోనే పాంబండ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అదనపు గదులను కూడా ప్రారంభించారు. అనంతరం బండవెల్కిచర్లలో నిర్మించిన ఎస్సీ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు రాంరెడ్డిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సూర్యనాయక్‌ తండాలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ హరికృష్ణ, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ పీరంపల్లి రాజు, పాంబండ దేవాలయ చైర్మన్‌ రాములు, ఈవో సుధాకర్‌, పాలకవర్గ సభ్యులు, సర్పంచ్‌ శిరీష, ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, ఏపీఎం శోభ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

పరిగి ప్రభుత్వ ఉద్యోగుల ప్రాంతంగా మారాలి

పరిగి : కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలను పరిగి ప్రాంతం నుంచి ఎక్కువ మంది సాధించి, ఈ ప్రాంతానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం పరిగిలోని మినీస్టేడియంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగ అభ్యర్థులతో మాట్లాడారు. ఈసందర్భంగా వారికి యూనిఫాం అందజేశారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ శిక్షకుడు యాభాజీని ఎమ్మెల్యే అభినందించారు. మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌, సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి, బలాల, రఘువీర్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising