ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈజీగా ఇళ్ల నిర్మాణ అనుమతులు

ABN, First Publish Date - 2022-05-16T05:30:00+05:30

ఈజీగా ఇళ్ల నిర్మాణ అనుమతులు

మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వికారాబాద్‌/మేడ్చల్‌, మే16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇళ్లు, భవనాల నిర్మాణ అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీఎస్‌ బీపా్‌సను జిల్లాలో అమలుచేయడం జరుగుతుందని కలెక్టర్‌ నిఖిల పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పట్టణ, పల్లె ప్రగతి, ధాన్యం కొనుగోలు, అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. హరితహారం కోసం  గ్రీన్‌ బడ్జెట్‌ నిధుల నుంచి రూ. 11కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. సమీకృత వెజ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ల నిర్మాణం పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మునిసిపల్‌ కమిషనర్లు జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌, ఫిజికల్‌ హెల్త్‌ ఈఈ ప్రభాకర్‌ రెడ్డి, డీపీవో మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై 170 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో  అధికారులు విజయకుమారి, అశోక్‌కుమార్‌, ల్యాండ్‌ సర్వే ఏడీ రాంరెడ్డి, ఏవో హరిత పాల్గొన్నారు.  కాగా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను  త్వరితగతిన పరిష్కరించాలని, మేడ్చల్‌జిల్లా  అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 60 మంది వినతులను అందజేశారన్నారు. డీఆర్‌వో లింగ్యానాయక్‌, డీఆర్‌డీవో పీడీ పద్మజారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising